నితిన్.. ఒకప్పుడు హిట్టు మీద హిట్టు కొట్టాడు.. ఇప్పుడు ప్లాపుల మీద ఫ్లాపులు.. అందుకనే.. నితిన్ చేయాల్సిన రెండు క్రేజీ ప్రాజెక్టులు మిస్ అయ్యాయి. దీంతో ఆలోచనలో పడ్డ నితిన్.. కాస్త గ్యాప్ తీసుకుని ఎలాంటి సినిమా చేయాలో బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడట. రీసెంట్ గా ఓ భారీ సినిమా చేయడానికి సై అన్నాడట. అయితే.. ఈ మూవీకి ఒకరు కాదు.. ఇద్దరు దర్శకులు అని తెలిసింది. ఇంతకీ.. నితిన్ మిస్సైన రెండు క్రేజీ ప్రాజెక్టులు ఏంటి..? హిట్టు కోసం నితిన్ నమ్ముకున్న ఆ ఇద్దరు దర్శకులు ఎవరు..?
నితిన్.. జయం, దిల్, సంబరం, సై.. చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే వరుసగా సక్సెస్ సాధించి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్లో ముందుకు వెళ్లాడు. అయితే.. మన పక్కంటి కుర్రాడులా ఉండే నితిన్.. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాని పాత్రల్లో నటించాడు. దీంతో వరుసగా ప్లాపుల్ వచ్చాయి. రామ్, టక్కరి, హీరో, ఆటాడిస్తా, ద్రోణ, మారో.. తదితర చిత్రాలతో వరుసగా ప్లాపులు వచ్చాయి. ఆతర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, చినదాన నీ కోసం సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు.
నితిన్ ట్రాక్ లోకి వచ్చాడనుకుంటే… చెక్, రంగదే, మాస్ట్రో, మాచర్ల నియోకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలతో మళ్లీ వరుసగా ఫ్లాపులు చూసాడు. దీంతో నితిన్ మార్కెట్ పడిపోయింది. అందుకనే.. చేతిలో ఉన్నాయి అనుకున్న రెండు క్రేజీ ప్రాజెక్టులు బలగం వేణు డైరెక్షన్లో ఎల్లమ్మ, విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో మూవీ క్యాన్సిల్ అయ్యాయి. నితిన్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్న ఈ టైమ్ లో సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ముందుకు వచ్చింది.
అయితే.. ఈసారి సక్సెస్ కోసం నితిన్ కొత్త దర్శకులను నమ్ముకున్నాడు. అది కూడా ఒకరు కాదు… ఇద్దరిని. అవును.. నితిన్ చిత్రానికి ఇద్దరు దర్శకులు కలిసి వర్క్ చేస్తుండడం విశేషం. ఇంతకీ ఎవరంటారా..? సోము-నర్రి. ఈ ఇద్దరూ కలిసి నితిన్ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ రెడీ చేశారు. కొన్ని నెలల నుంచి కథ పై కసరత్తులు చేస్తున్నారు. ఎట్టకేలకు స్క్రిప్టు లాక్ అయ్యింది. ఈ సినిమాలో ఇప్పటి వరుకు చూడని కొత్త లుక్‌లో నితిన్ కనిపిస్తాడని టాక్. ఈ మూవీ సక్సెస్ నితిన్ కి చాలా అవసరం. సక్సెస్ ఉన్న డైరెక్టర్ వెనకపడకుండా.. కాంబినేషన్ కోసం చూడకుండా.. కథను నమ్మి నితన్ ఈ సినిమా చేస్తున్నాడు. మరి.. ఈ సినిమాతో అయినా నితిన్ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.


