పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నెల 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. బీజేఎల్పీ సమావేశంలో సీఎంను ప్రకటించనుంది హైకమాండ్. సీఎం రేసులో సువేందు, దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిసిత్ ప్రమాణిక్ ఉన్నారు.
సువేందు అధికారితో పాటు పలువురు నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సువేందు అధికారి, పలువురు నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో కీలక భేటీలు జరగనున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ బెర్త్‌లను హైకమాండ్ ఫైనల్ చేయనుంది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.


