2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం – ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రతినెల 1వ తారీఖునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బీసీ వర్గాలు సమాజానికి వెన్నుముక అని… వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది తమ విధానమన్నారు. పీ4 విధానం ద్యారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అబ్దుల్‌ నజీర్ వివరించారు.

ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందన్న ఆయన.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎంతో నష్టపోయిందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. కాగా.. వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.

Latest Articles

ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం.. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించి మోదీ

ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టెర్మినల్ భవనంలోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. విమానాశ్రయ టెర్మినల్‌ గురించి ప్రధానికి జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వివరించారు. చెక్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్