2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతినెల 1వ తారీఖునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బీసీ వర్గాలు సమాజానికి వెన్నుముక అని… వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది తమ విధానమన్నారు. పీ4 విధానం ద్యారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అబ్దుల్ నజీర్ వివరించారు.
ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందన్న ఆయన.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎంతో నష్టపోయిందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. కాగా.. వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.