వివాదంలో.. కుబేర..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ కుబేర. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మూవీలో రష్మిక కథానాయిక. అయితే.. ఇప్పుడు కుబేర వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ.. కుబేర వివాదం ఏంటి..? రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

నాగార్జున, ధనుష్, రష్మిక.. ఈ క్రేజీ కాంబోలో కుబేర మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆమధ్య ఈ సినిమా నుంచి ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ.. గ్లింప్స్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే.. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో కుదరలేదు. ఆతర్వాత కుబేర మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు కుబేర మూవీ టైటిల్ తనది అంటూ ఓ నిర్మాత, దర్శకుడు మీడియా ముందుకు వచ్చాడు. కుబేర టైటిల్ ను 2023లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించానని.. 90 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని నిర్మాత కరిమకొండ నరేందర్ తెలియచేశాడు. 5 భాషల్లో ఈ టైటిల్ రిజిష్టర్ చేయించామని.. అందుచేత శేఖర్ కమ్ముల అండ్ టీమ్ టైటిల్ మార్చుకోవాలి లేదా.. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కుబేర మూవీ టైటిల్ వివాదస్పదం అవ్వడంతో.. ఏం జరగనుంది..? ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యిందట కానీ.. కొంత టాకీ బ్యాలెన్స్ ఉందట. త్వరలోనే బ్యాలెన్స్ వర్క్ ను కంప్లీట్ చేయనున్నారని సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, ధనుష్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి.. కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే.. జూన్ లో రావచ్చనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్