ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై షెడ్యూల్ ఖరారు

ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్రాన్స్, అమెరికాల దేశాలలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు.

ప్యారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్‌కు బయలుదేరతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత అక్కడి న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధానమంత్రి పరిశీలిస్తారు.

ఇక, ఈనెల 12వ తేదీ సాయంత్రం ఆయన ఫ్రాన్స్ నుండి బయలుదేరి వాషింగ్టన్ చేరుకుంటారు. 13వ తేదీ ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారని సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్