38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించినట్లు జైరాం రమేష్‌ తెలిపారు. గ్యారెంటీ అంటే పౌరుల హక్కు అన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని.. అలాగే పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక… మేనిఫెస్టోలో ముఖ్యంగా రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, మహిళలకు 2వేల 500 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే కులగణన చేసి.. పూర్వాంచల్ కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక వంట గ్యాస్ సిలిండర్ 500ల రూపాయలకే ఇస్తామని.. అలాగే ఉచిత రేషన్ కిట్ ఇస్తామని ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, నిరుపేదలకు నెలకు 5 వేల చొప్పున పింఛన్ ఇస్తామని తెలిపింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.

Latest Articles

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అతిపెద్ద పండుగ మహానాడు ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకునే మహానాడు వేదిక స్థలంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రతి ఏడూ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ పసుపు పండుగను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్