మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాయి రెడ్డి కన్నింగ్, తెలివైన, లౌకికం ఉన్న రాజకీయ నాయకుడని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని విజయ్ సాయి రెడ్డి వాడుకున్నట్లు ఇంకెవరూ వాడుకోలేదని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని విజయ్ సాయిరెడ్డికి హామీ ఇచ్చి ఇవ్వలేదని అన్నారు
ఇంకా ఓవీ రమణ మాట్లాడుతూ.. ” ఆస్తులు అమ్మి విజయసాయి రెడ్డి రెండోసారి ఎంపీ అయ్యాడు. రెండోసారి ఎంపీ పదవి రాదని ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసుకుంటా అంటూ కోర్టులో రిట్ పిటిషన్ వేసాడు. వైఎస్ ఫ్యామిలీ గురించి అన్ని తెలిసిన వ్యక్తి విజయ్ సాయి రెడ్డి. విజయసాయి రెడ్డి కన్నింగ్ కాబట్టే జగన్ పక్కనబెట్టారు. వ్యక్తిత్వాలు, సంబంధాల గురించి సాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. వైసీపీ ప్రభుత్వంలో దుష్టచతుష్టయం వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది.
జాతీయ పార్టీతో సంబంధం పెట్టుకొని జగన్‌ను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ సాయి రెడ్డి. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం లేని వ్యక్తి విజయ్ సాయి రెడ్డి. జగన్ పక్కన ఉన్న నలుగురు మిగిలిన సామాజిక వర్గాన్ని అధోగతి పాలు చేశారు. బ్లాక్ మెయిలర్ విజయ్ సాయి రెడ్డి వేరొక పార్టీలో చేరి..మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నాడు.
టీటీడీలో చిన్న చిన్న పొరబాట్లు దొర్లాయి. మానవ తప్పిదం వల్లే భక్తులు చనిపోయారు. మరికొందరు గాయాల పాలయ్యారు. టీటీడీలో అపచారం జరిగిపోయిందని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. చెలికత్తెలను తీసుకొచ్చి కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయంలో కూర్చోబెట్టిన చరిత్ర మీది కరుణాకర్ రెడ్డి. కళ్యాణమస్తు పేరుతో కొన్ని వేల బంగారు తాళిబొట్లను మాయం చేసి కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తి . అనవసరమైన కట్టడాలు కట్టిన కరుణాకర్ రెడ్డి అపచారం అంటూ మాట్లాడటం సిగ్గుచేటు.
ఓ అధికారి తీసుకున్న నిర్ణయాల కారణంగా వారి కుటుంబం అధోగతి పాలైంది. వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు గంగమ్మ దేవత అని ఏ పురాణాల్లో ఉంది…?.నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం సబబు కాదు. అపచారం అని చెప్పి కొండపై ఏదో జరిగిపోతోందని చెప్పడం సబబు కాదు. అతి విశ్వాసం, అతి నమ్మకం ఉంటే జగన్ పార్టీ మూతపడే పరిస్థితి వస్తుంది. బీజేపీ విజయ సాయి రెడ్డిని చేర్చుకోవాలనే ఆసక్తి చూపిస్తోంది. బీజేపీలో చేరేందుకు విజయ సాయి రెడ్డి ఊవిళ్లూరుతున్నారు. చంద్రబాబు మా అన్న వరుస అని చెప్పి ఆయనపై అనేక విమర్శలు చేశారు. ఆనాడు మూడు పెళ్లిలు చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసి.. నేడు అత్యంత ఆప్తుడు అంటూ విజయసాయిరెడ్డి అంటున్నారు”.. అని ఓవీ రమణ అన్నారు.