గ్యాస్‌ వాల్వ్‌లో పెట్టి డ్రగ్స్‌ సరఫరా.. ముఠా అరెస్ట్‌

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్.ఓ.టి ఎల్.బి నగర్, నేరేడ్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఇద్దరు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 190 గ్రాముల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మాదక ద్రవ్యాలను రాజస్థాన్ రాష్ట్రం నుండి ఇక్కడకు తీసుకొచ్చి నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాలపై పోలీసులు నిఘా పెరగడంతో డ్రగ్స్ సరఫరా చేయడం కష్టంగా మారింది. దీంతో నిందితుడు గ్యాస్ స్టవ్ మెకానిక్ కావడంతో గ్యాస్ వాల్వ్ లో డ్రగ్స్ ప్యాకెట్లను పెట్టి వాటిని మత్తుమందు బానిసలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ర్యాపిడో ద్వారా డ్రగ్స్‌ వినియోగదారులకు సప్లై చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు.

Latest Articles

ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం

తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్