అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్.ఓ.టి ఎల్.బి నగర్, నేరేడ్‌మెట్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఇద్దరు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 190 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మాదక ద్రవ్యాలను రాజస్థాన్ రాష్ట్రం నుండి ఇక్కడకు తీసుకొచ్చి నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాలపై పోలీసులు నిఘా పెరగడంతో డ్రగ్స్ సరఫరా చేయడం కష్టంగా మారింది. దీంతో నిందితుడు గ్యాస్ స్టవ్ మెకానిక్ కావడంతో గ్యాస్ వాల్వ్ లో డ్రగ్స్ ప్యాకెట్లను పెట్టి వాటిని మత్తుమందు బానిసలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ర్యాపిడో ద్వారా డ్రగ్స్ వినియోగదారులకు సప్లై చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు.