‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’లో ముఖ్య పాత్రలో అలీ

దాదాపు 1250 సినిమాలకు పైగా నటించిన అలీ కెరీర్‌లో హీరోగా 52 సినిమాల్లో నటించారు. భారతదేశంలోని అన్ని భాషల్లో అలీ తనదైన శైలిలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మ్యాడ్‌ ఫిలిమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆశిష్‌ కుమార్‌ దూబే రచించి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాల్ని ముంబైలో చిత్రీకరించారు.

ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ–‘‘ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథ ఈ సినిమా. ఈ సినిమాలో మెయిన్‌రోల్‌లో నన్ను ఎన్నుకున్నందుకు నిర్మాతకు, దర్శకునికి నా కృతజ్ఙతలు తెలియచేస్తున్నా. గతంలో అనేక సినిమాల్లో సల్మాన్‌ఖాన్‌ పక్కన అనేకమంది హీరోల పక్కన క్యారెక్టర్‌ యాక్టర్‌గా నటించాను. ఈ సినిమాలో ఫుల్‌లెంగ్త్‌ ఉన్న పాత్ర చేయటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే, రౌనక్‌ ఖాన్, ఫైజల్‌ మాలిక్, అంచల్‌ గాంధీ, కైరా చౌదరి తదితరులు నటిస్తున్నారు.

Latest Articles

ఎమ్మెల్యేలతో ఎంపీ బాలశౌరికి ఎందుకు పొసగడం లేదు?

మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి పొలిటికల్ జర్నీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న ఆయన.. స్థానిక ఎమ్మెల్యేలతో మాత్రం ఎప్పుడూ ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్