ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలు

ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు ఈసీఐ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్‌.కృష్ణయ్య రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీఐ రెడీ అయ్యింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా..164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే ఉంది. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న మూడు స్థానాలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. ఈ మూడు స్థానాలను టీడీపీ తీసుకుంటుందా..భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనేదానిపై చర్చ జరుగుతోంది. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక, జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 11 స్థానాలను కైవసం చేసుకుంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైంది. ఆ తర్వాత 100 రోజుల్లోనే జగన్‌ పార్టీ రాజ్యసభలో మూడు స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా లేరు. తాజా ఉప ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యులు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్