అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా కనుమూరి రఘురామకృష్ణరాజు ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతిపక్ష హోదా మనం అడిగితే వచ్చేది కాదన్నారు చంద్రబాబు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలని చెప్పారు. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10శాతం స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందన్నారు. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారని అన్నారు. జగన్ అహంకారంతో ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా.. అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ సీఎం చంద్రబాబు
0
157
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


