హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల చేపట్టిన మహా ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలోనే వచ్చారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఆటో డ్రైవర్లు ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆవేనద వ్యక్తం చేశారు. గతంలో ఆటో డ్రైవర్లు 2 వేలు సంపాదించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు 800 వందలు సంపాదిస్తున్నారని తెలిపారు. రవాణా సంక్షేమ బోర్డు, ఇన్స్యూరెన్స్ హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏడాదికి ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల మహా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కేటిఆర్
0
170
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


