చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రాజ్ పాకాల

జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల… చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై కేసు నమోదయింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదితో కలిసి రాజ్ పాకాల వచ్చారు.

రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఫాంహౌస్‌కు విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాజ్‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న విజయ్‌ మద్దూరికి సంబంధించి పోలీసులు విచారణలో ఆరా తీశారు. విజయ్‌ మద్దూరికి డ్రగ్స్‌ పాజిటివ్‌ రావడంతో తనకు సంబంధం లేదని, అతడి ఫోన్‌ ఎక్కడుందో తనకు తెలియదని రాజ్‌పాకాల చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాజ్ పాకాలతో పాటు విజయ్ మద్దూరిని కూడా పోలీసులు విచారించారు.

రెండు రోజుల క్రితం, మోకిల పోలీసులు… రాజ్ పాకాలను దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మొన్న విచారణ జరిపిన అనంతరం… అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే రావాలని సూచించడంతో ఈరోజు ఎక్సైజ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్