దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటన

దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటించనుంది.. మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, మూసి రివర్ ప్రంట్ అధికారుల బృందం పర్యటించనుంది. ఇవాళ్టి నుంచి 24 వరకు పర్యటన కొనసాగుతుంది. సియోల్‌లోని రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిని మంత్రుల బృందం పరిశీలించనుంది. ఇందుకోసం 50 మందితో కూడిన బృందం బయలుదేరింది.

నగరంలో మాపోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగం కేంద్రాన్ని మంత్రులు, అధికారులు సందర్శించనున్నారు. సియోల్ నగరపాలక సంస్థ రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం WTE టెక్నాలజీ వినియోగం, పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చేపట్టింది. సియోల్ నగర పాలక్ సంస్థ మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది. ఇటువంటి నాలుగు ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించేందుకు సిద్దమైంది. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశంపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్