తిరుమల శ్రీ వారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో శివకు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ నెల 27న దేవర సినిమా విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, సినిమా విజయవంతం కావాలని కోరినట్లు కొరటాల శివ తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ డైరెక్టర్ కొరటాల శివ
0
358
Previous article
Next article
Latest Articles
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం
కర్ణాటకలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన...
- Advertisement -
- Advertisement -


