రేపు శ్రీ సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ప్రజవేదికలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బహిరంగ సభ అనంతరం గుండుమల గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఏ ప్రాంతంలో పర్యటన ఉంటే ఆ ప్రాంత వాసులతోనే మమేకం అయ్యే విధంగా నూతన విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. లారీల్లో, బస్సుల్లో, ప్రజలను తరలించే విధానానికి స్వస్తి చెప్పామని ఆయన తెలిపారు. చంద్రబాబు పర్యటనలో సామాన్య ప్రజలతో మమేకం అయ్యే విధంగా ప్రజవేదికను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
రేపు శ్రీ సత్య సాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
0
494
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


