ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం

పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబరు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-19లో టీడీపీ హయాంలో 5రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను.. గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్‌ కార్యాలయాలకు కేటాయించింది.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించనిచోట కొత్త క్యాంటీన్‌ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలివిడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్