ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతోపాటు.. YSR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం తెలిపారు శాసనసభా సభ్యులు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం… రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే YSR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు కూడా ఏసీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా ఉన్న పేరును మార్చిన వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీ గా మార్చింది. దీంతో ఆగ్రహించిన నాటి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే పేరు మార్పు చేసింది.


