నభా నటేష్ ఎంతోమందికి స్ఫూర్తి: విశ్వక్ సేన్

గ్లామర్‌తో పాటు పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించగల హీరోయిన్ నభా నటేష్. ఆమె తన మొదటి సినిమా నుంచే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోనూ నభా అట్రాక్టివ్ లుక్స్ తో పాటు మంచి పర్‌ఫార్మర్ అనే పేరు తెచ్చుకుంది. ఆమె లేటేస్ట్ మూవీ డార్లింగ్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజైంది. ఈ ట్రైలర్‌లో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా నభా నటేష్ చూపిన నటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా వచ్చిన హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ అశ్విన్ రామ్ డార్లింగ్ సినిమా పట్ల నభా చూపించిన డెడికేషన్‌ను అప్రిషియేట్ చేశారు. రెండేళ్ల కిందట యాక్సిడెంట్‌కు గురైన నభా ఆ ప్రమాదం నుంచి తేరుకుని మళ్లీ స్క్రీన్ మీద అంతే ఎనర్జిటిక్‌గా కనిపించడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – ‘‘ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కుంగిపోయిన భావనకు గురవుతారు. కానీ నభా ఆ ప్రమాదం నుంచి తేరుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. నటిగా ఆమెకున్న పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి.’’ అని అన్నారు.

దర్శకుడు అశ్విన్ రామ్ స్పందిస్తూ – ‘‘డార్లింగ్ స్క్రిప్ట్‌ను కొందరు హీరోయిన్స్‌కు చెప్పినప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్ చేసేందుకు భయపడ్డారు. కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు ఇలాంటి పాత్రలతో మెప్పించారనేది వారి భయం. కానీ నభాకు స్టోరీ చెప్పినప్పుడు ఇంతేనా.. చేస్తాను అని చెప్పింది. నటిగా తనకున్న కాన్ఫిడెన్స్ ను ఈ సందర్భం చూపిస్తుంది. ఆమె మా కథను నమ్మి వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు.’’ అన్నారు.

నభా నటేష్ మాట్లాడుతూ – ‘‘ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్‌లో డార్లింగ్ ఆఫర్ నా దగ్గరకు వచ్చింది. ఇలాంటి పాత్రలో నటించాలనేది నా డ్రీమ్.’’ అని చెప్పింది.

ప్రియదర్శితో కలిసి నభా నటేష్ లీడ్ రోల్‌లో నటించిన డార్లింగ్ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. డార్లింగ్ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్