‘పేక మేడలు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను ‘పేక మేడలు’తో హీరోగా పరిచయం చేస్తూ అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్ సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని రెండవ సింగిల్ ఆడపిల్ల సాంగ్ విడుదలైంది.

‘ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా’ అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ సాకే రాజశేఖర్ గారు పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలై 19న విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పీఆర్ఓ: మధు VR

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్