26 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం

  హైదరాబాద్ రామంతాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు. ఏకంగా 2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు దోపిడీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

   కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్ల పరిస్థితి. తాను పని చేస్తున్న బ్యాంక్‌నే మోసం చేసి కోట్లాది రూపాయలు తన అకౌంట్‌లోకి మళ్లీంచుకున్నాడు. గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు హైదరాబాద్ రామంతాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు. ఈనేపథ్యంలోనే వారు ఖాతాదారులకు తెలియకుండా 2.80 కోట్ల రూపాయలు కాజేశారు. సంబంధింత ఖాతాదారులకు తెలియ కుండా డాక్యుమెంట్లు పోర్జరీ చేసి వాటితో లోన్‌కు అప్లై చేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది పేర్లపై లోన్లు తీసుకున్నారు. అనంతరం లోన్ అమౌంట్‌ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అయితే ఇటీవల రామంతాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు కొత్త మేనేజర్ వచ్చారు. ఈ నేపథ్యం లోనే ఆయన బ్యాంక్‌ గత ఫైల్స్‌ను తనిఖీ చేశారు. దీంతో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు చేసిన మోసం బయటపడింది. వెంటనే కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్లు షేక్ సైదులు, గంగ మల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ షేక్ సైదులు, అతడి భార్య సుష్మ, కొడుకు పీరయ్య పరారీ అయ్యారు. మరో మేనేజర్ గంగ మల్లయ్య కూడా పరారీలో ఉన్నాడడంతో పోలీసులు గాలించి ఇద్దరును అదుపులోకి తీసుకొని రిమాండ్‌ కు తరలించారు.బ్యాంకుల్లో ప్రజలకు ఎంతో నమ్మకం సేవలు అందించాల్సిన బ్యాంక్‌ మేనేజర్లు ఖాతాదారుల డాక్యుమెంట్లు పోర్జరీ చేసి దోపిడీకి పాల్పడడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్