తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

పాలన వ్యవస్థపై ప్రక్షాళనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యను నియమించడంతో పాటు.. హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిం చారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యద ర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీ ప్‌ కొనసాగనున్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ను నియమిం చడంతో పాటు టీపీటీఆర్‌ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్