ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మూడో బ్లాక్ రూమ్ నంబర్ 207లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ప్రజల, మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీరం చేశారని దుయ్యబట్టారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శిం చారు.