జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వైద్య రంగంలో ఉన్న సంజయ్‌కి రాజకీయంగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్‌ని కాదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారని ఫైర్ అయ్యారు. తల్లిలాంటి పార్టీ బీఆర్ఎస్‌కు తీరని ద్రోహం చేశారని పార్టీ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ పేరు మీద ఎమ్మెల్యేగా గెలిచి, స్వప్రయోజనాల కోసం స్వంత పార్టీ విలువ లను దిగజార్చడం సహించరాని నేరమని విమర్శించారు.