ఏపీలో విజృంభిస్తున్న డయేరియా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరి యా బారినపడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువా తపడ్డారు. మూడు జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతు న్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కొందరు డయేరియా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు వాంతులు, విరోచనాలతో జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్ప త్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 19 మంది డయేరియా బాధితు లకు వైద్యసిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రభుత్వ స్పత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను పరామ్శించారు.

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో నలుగురు వాంతులు, విరేచనాలతో నీరసించి పోయారు. వారిలో నడిపి నాగన్న అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొమ్మోజు సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్‌డీవో ఇట్ల కిషోర్, డీఎంహెచ్‌వో జె.నరసింహ నాయక్, డీపీవో సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పీహెచ్‌సీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్