హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించడంతో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రముఖ నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్ ఆయనను కలిసి అభినందించారు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాంకాంక్షలు తెలిపారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉండే బాలయ్య, అదేవిధంగా బసవతారకం హాస్పిటల్‌తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారని దిల్ రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షుడు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. అనుపంరెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి పాల్గొన్నారు.
బాలకృష్ణను కలిసిన దిల్ రాజు అండ్ టీమ్
0
469
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


