ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికింది. లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 15 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరగ్గా వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇవాళ కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో.. రౌస్‌అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది.
బెయిల్ దొరికిన కేజ్రీవాల్
0
314
Previous article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


