ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరకి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కనబెట్టిన సీఎం చంద్రబాబు మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్‌కు పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్‌ఎండీ ఫరూక్‌కు మైనార్టీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక గుమ్మడి సంధ్యా రాణికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీలో మంత్రివర్గ శాఖలపై కొనసాగుతున్న ఉత్కంఠ
0
228
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


