ఫిట్ నెస్ లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేటు పాఠశాలల, కాలేజీల బస్సులపై ఆర్టీఓ అధికారులు వరుస దాడులు చేస్తూ కొరడా ఝుళిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఆర్టీఓ అధికారులు ఫిట్ నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలల రీ ఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను రెండు రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్ నెస్, ఫర్మిట్, ట్యాక్స్, కండిషన్ సరిగా లేకుండా ఉన్న 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్ నెస్ లపై అవగాహన కల్పించామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్ నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


