రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పని చేశారని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం లో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవం గా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు మూడు పార్టీల నేతలకు ధన్యవాదా లు తెలిపారు.రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారు -చంద్ర బాబు
0
218
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


