కుల గణన కసరత్తు
కుల సర్వే కసరత్తు కోసం నిపుణులతో బీసీ కమిషన్ భేటీ అయింది. కార్యాచరణలో భాగంగా పలు రంగాల నిపుణులతో సుదీర్ఘ సమాలోచనలు చేసింది. విధివిధానాల ఖరారుకు మేధావుల అభిప్రా యాలను కమిషన్ కోరింది. ఫార్మాట్‌లో చేర్చాల్సిన ప్రశ్నలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కమిషన్ అడిగింది. కమిషన్ పనితీరుపై చైర్మన్ కృష్ణమోహన్‌ను పీపుల్స్ కమిటీ బృందం అభినందిం చింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అప్పగించాలని డిమాండ్
నిర్మల్ జిల్లా భైంసాలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అప్పగించాలనే డిమాండ్‌తో ఆర్డీఓ ఆఫీసును లబ్ధిదారు లు ముట్టడించారు. ఆర్డీఓ కోమల్‌రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. సంవ త్సరం క్రితం లక్కీ డ్రా ద్వారా ఇళ్లు కేటాయించినా ఇంతివరకూ అప్పగించలేదని వాపోయారు. ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెడ్డి కులంలోకి రానివ్వం
ముద్రగడ పద్మనాభం ఏం సాధించారని రెడ్డి కులంలోకి వస్తారని తూర్పుగోదావరి జిల్లా కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి అన్నారు. తమలో తమకు కుంపట్లు పెట్టాలని ముద్రగడ చూస్తున్నారని ఆరోపించారు. వయసుకు తగిన పనులు పద్మనాభం చేయడం లేదన్నారు. రెడ్డి కులంలోకి పద్మనాభాన్ని రానివ్వబోమని కర్రి ఫైరయ్యారు.
రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు
జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయ త్నా నికి బాధ్యులుగా CID మాజీ చీఫ్ సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, అప్పటి CID అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను పేర్కొన్నారు.
రాయలసీమ సాగునీటి సమస్య
నంద్యాల జిల్లా సంగమేశ్వర క్షేత్ర సమీపంలోని సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 8సంవత్సరా లు అయింది. దీంతో రైతులు, ఉద్యమకారులు సిద్దేశ్వరం వద్ద సమావేశం నిర్వహించారు. రాయలసీమ కు ఒక కారు పంట కూడా రావడం కష్టమని ప్రత్యేక ప్యాకేజీతో సీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాల అమ్మకం
ఖరీఫ్ పంటపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల పట్ల రైతులను అప్రమత్తం చేయడంతో పాటు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠ్య పుస్తకాలు సీజ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నారాయణ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలను వేలాది రూపాయలతో బలవంతంగా తల్లితండ్రులకు విక్రయిస్తున్నారు. యాజమాన్యంపై మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్‌కి ఫిర్యాదు చేసి సీజ్ చేయించడం జరిగిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ తెలిపారు.
రైతుల ఆందోళన
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వాగు నుండి చెన్నూరు రిజర్వాయర్‌కు ఇసుక తరలింపు అనుమతులను నిలిపివేయాలంటూ జనగామ కలెక్టరేట్‌ను వాగు సమీప గ్రామస్తులు ముట్టడించారు. ఇసుక తరలింపు అనుమతులను నిలిపివేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా యని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి అంత్యక్రియలు చేయని వారసులు
ఆస్తి తగాదాతో మూడు రోజులు అవుతున్న మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా మార్చురిలోనే ఉంచిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది. తండ్రి మరణం తర్వాత వచ్చిన భూమిలో తమకు వాటా కావాలంటూతో బుట్టువులు కోర్టును ఆశ్రహించడంతో కొద్దీ రోజులుగా హనుమంతు మానసిక వేదనకు గురయ్యడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించా రు.