మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహిం చారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, నాణ్యతలేని, పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో పలుసార్లు ఆందోళన నిర్వహించారు. అయినా యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
0
194
Previous article
Next article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


