ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది. కూటమి గెలుస్తోందని అంచనా వేసిన ఒకే ఒక సంస్థ కేకే సర్వే. రెండు రోజుల కిందట వెలువడ్డ సర్వే అంచనాల్లో టీడీపీ కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టింది కేకే సర్వే సంస్థ. ఎవరూ ఊహించని స్ధాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది. పలు జాతీయ, లోకల్ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన అంచనా నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడినన్ని ఎగ్జిట్ పోల్స్ గతంలో ఎప్పుడూ లేవు. గత ఎన్నికల్లో ఫలితాల్ని కచ్చితంగా ఊహించిన వారిలో సీపీఎస్, వీడీపీ అసోసియేట్స్ వంటి సంస్థలు ఈసారి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. అదే సమ యంలో గతంలో కచ్చి తమైన ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్ వంటి వారు కూడా వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చేసారు. ఇలాంటి పరిస్ధితుల్లో కేకే సర్వే హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సంచలనంగా మారింది.


