ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బాలయ్య సతీమణి సందడి

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బంపర్ తంబోలాను, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నందమూరి బలకృష్ణ సతీమణి వసుంధర ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్. ఎన్. సి. సీ సభ్యులు, కుటుంబ సభ్యులు, అతిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . ఈ బంపర్ తంబోలాలో గెలిచిన వారికీ 5 రౌండ్స్ ఐదు కార్లు ఆల్టో , సెలెరియో,టాటా టియాగో ,టొయోట గ్లాంజా, బంపర్ ప్రైజ్ మెర్స్డ్స్ బెంజ్ ఎ క్లాస్ అందజేశారు. బెంజ్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్, డి. సాయికిరణ్. బంపర్ తంబోలా విన్నర్స్ కు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు, నందమూరి వసుంధర చేతుల మీదుగా బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి, తంబోలా కమిటీ సభ్యులు స్వరూప, చేతనా, రోహిణి, శైలజ, హకీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ నవనామి – మెగాలియో, డి ఎస్ ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడీస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్షిప్స్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్, హర్ష ఆటో, మందిర్, ప్రకృతి ఎవెన్యూస్ & వంశీరాం బిల్డర్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెక్రటరీ ముళ్లపూడి మోహన్ మాట్లాడుతూ : గతంలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. అప్పుడున్న కమిటీ ప్రస్తుత కమిటీ సపోర్ట్ ద్వారానే ఇది అంతా జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మెంబెర్స్కు రిలాక్సేషన్ లభిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతాం. కమిటీ సభ్యుల సహారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి సపోర్ట్ చేసిన నందమూరి వసుంధర గారికి నా తరఫున మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్