జూన్‌ 14న థియేటర్లలో విడుదల కానున్న ‘యేవమ్‌’

‘‘రొటిన్‌కు భిన్నంగా కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం’’ అని అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యేవమ్‌’. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌, అషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ‘‘మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మీనింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా వుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అని అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, అషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్