20.2 C
Hyderabad
Tuesday, February 3, 2026
spot_img

వడ్ల కొనుగోలులో రేవంత్ సర్కార్ విఫలం

యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటీ నుంచి ప్రతిపక్షాల ప్రధాన ఎజెండాగా సాగిన ధాన్యం సేకరణ ఎక్కడిదాకా వచ్చింది. తడిసిన ధాన్యం కొనలేదని ఒకరు, తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని మరొక పార్టీ ఆరోపణలు చేసింది. ఇక సివిల్ సప్లైస్ కమీషనర్ చౌహాన్ టార్గెట్‌గా బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో అసలేం జరిగింది. మిల్లర్లతో కుమ్మక్క య్యారన్న వ్యాఖ్యలకు కమీషనర్ చౌహాన్ ఏమని స్పందించారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోలు వారం ముందు నుంచే మొదలైంది. నిల్వ ఉంచడం, వర్షం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 7వేల 172 కొనుగోలు కేంద్రాలను డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రైతులు, వ్యాపారులకు మధ్య వచ్చే ఉండే తాలు, తరుగు వివాదాలను రాకుండా సివిల్ సప్లైస్ జాగ్రత్త పడింది. తాలు, తరుగు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని తేమ విషయంలో రైతులకు సహాయపడాలని కమిషనర్ చౌహాన్ అధికారులకు ఆదేశాలి చ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39లక్షల 51వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 2022-23 యాసంగి ధాన్యం సేకరణలో 42 శాతం రైతులకు డబ్బులు ఇస్తే ఈసారి 83శాతంగా ఇప్పటి వరకు 7వేల 43కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశామని కమిషనర్ తెలిపారు.

సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్‌కి సంబధించిన 6వేల కోట్ల లోన్ అమౌంట్‌ను తగ్గించడం, 668 కోట్ల మిల్లర్ల పెండింగ్ బకాయిలను వసూల్ చేసి చౌహాన్ తన మార్క్‌ను చాటాడు. డబ్బులు తీసుకొని ధాన్యాన్ని ఇవ్వని మిల్లర్ల మీద 40కి పైగా క్రిమినల్ కేసులు, జైలుకు పంపించడం లాంటి ఘటనలతో మిల్లర్లలో క్రమ శిక్షణను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక వైపైతే మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు కమిషనర్ చౌహాన్‌పై బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ఆరోపణల మీద కమిషనర్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులందరూ గ్రౌండ్ లెవెల్‌లో పని చేశారని డిపార్ట్‌ మెంట్ స్థాయి దిగజార్చేలా మాట్లాడం కరెక్ట్ కాదని కమిషనర్ సూచించారు. మరోసారి తప్పుడు ఆరోప ణలు చేస్తే చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని కమిషనర్ హెచ్చరించారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు మద్దతు ధర చెల్లించినప్పుడే రైతులు ఆనందంగా ఉంటారు. తాలు, తరుగు, తేమ విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షాననే నిలవాలి. విత్తనాలు, ఎరువులు, నీళ్లు ఇవ్వడం, మద్దతు ధర అంశాల్లో ప్రభుత్వాలు రైతులకు చేదోడుగా ఉండాలి. పండిన పంట నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల సంఖ్యను పెంచాల్సినవసరం ఉంది. ఇక ప్రస్తుతం సివిల్ సప్లైస్ డిపార్ట్‌ మెంట్‌లో అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్