28.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

కార్డన్ సెర్చ్ తో జల్లెడ పడుతున్న పోలీసులు

ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్‌ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్‌ రోజు, ఆ తర్వా త హింసాకాండ చోటుచేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. అణువణువునా జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీషీటర్స్, అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌కు 13 రోజులే మిగిలి ఉండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమాని తులపై గట్టి నిఘా పెట్టారు. ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీసు శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్నవారిపై కొరడా ఝళిపిస్తున్నారు ఎన్నికలరోజు అల్లర్లకు పాల్పడ్డ 2 వేల 790 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ వెయ్యి 5 వందల 22 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్‌ చేయగా.., మరికొందరికి 41 CRPC నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్