తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ కి చెందిన పలువురు దర్శకులు కలిశారు. రేపు LB స్టేడియంలో డైరెక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి సెలబ్రేట్ చేయనున్నట్టు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించారు. దర్శకరత్న దాసరి నారాయణరావుజన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. ఇటీవల డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడటంతో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మే 4న జరగాల్సిన డైరెక్టర్స్ డేని ఈసారి గ్రాండ్ గా రేపు నిర్వహించబోతు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ వీరశంకర్ తో పాటు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట.. పలువురు డైరెక్టర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందచేసి ఈవెంట్ కి ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి రామ్ గోపాల్ వర్మ కూడా వెళ్లడం విశేషం. రేపు LB స్టేడియంలో జరగబోయే డైరెక్టర్స్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ పాల్గొని స్కిట్స్, డ్యాన్సులు.. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నారు. అలాగే పలువురు హీరోలు, హీరోయిన్స్, నటీనటులు కూడా ఈ ఈవెంట్లో హాజరు కానున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు
0
155
Previous article
Next article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


