సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్‌ లో నటిస్తు న్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటు న్నారు. నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం తో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన హైదరా బాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్డు నం.20లో ఉన్న అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు వచ్చి చూసి, ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పలు సీరియల్స్‌లో నటించిన చందు. నటి పవిత్ర దుర్మరణంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. పవిత్రతో చందు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పవిత్ర మృతిని జీర్ణించుకోలేక ఆత్మ హత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై నార్సింగ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్