ఎన్నికల వేళ యూటర్న్ తీసుకున్న మోదీ ఆంతర్యం ఏమిటి ?

   ప్రధాని నరేంద్రమోదీ టోన్ మార్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యూ టర్న్ తీసుకున్నారు. హిందూ ముస్లీం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నట్లు వారణాశిలో తాజాగా ప్రకటించారు. హిందూ – ముస్లీం అని విడదీయబోనని, అలా చేసిన రోజున తానురాజకీయాలకే అర్హుడిని కాదని ప్రధాని మోదీ ప్రకటించి ఆశ్చర పరచారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటు దారులని అనలేదని, ఎక్కువ పిల్లలను కలిగి ఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని ఓ ఇంటర్ వ్యూలో పేర్కొనడం చర్చనీయాంశం అయింది.

  అన్నమాట కాదనడం రాజకీయ నాయకుడి లక్షణం. రాజకీయాల్లో కాకలు తీరిన నరేంద్రమోదీ.. తాజాగా తాను ముస్లీంలపై ద్వేషభావంతో మాట్లాడలేదని పేర్కొన్నారు. తనకు అందరూ సమానమేనని, “సబ్ కా సాథ్ సబ్ కా వికాశ్” తన మార్గం అని వివరించారు. ప్రధాని ఒక్కసారిగా ఇలా యూ టర్న్ తీసుకోవడానికి కారణం ఏమిటో రాజస్థాన్ లోని బాన్స్వాడలో గతనెల 21న ఓ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లు లాగేసుకుని ముస్లంలకు కట్టపెడుతుందని అన్నారు. మోదీ ఆ ప్రసంగం పూర్తిగా ముస్లింలపై విద్వేషమే. ముస్లింలనే ప్రస్తావిస్తూ.. పిల్లలు ఎక్కువ మంది ఉన్నవారు. చొరబాటు దార్లు అని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్నికల కమిషన్ ను ఫిర్యాదు చేసింది. బీజేపీ అధికారికంగా రూపొందించిన వీడియోలో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోను ఉపసంహరించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు, మీడియా వక్రీకరిస్తున్నారని మోదీ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజల ఆస్తులను, సంపదను ముస్లింలకు పంచేస్తారని మరో ఎన్నికల సభలో మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. హిందువుల మెడలో మంగళ సూత్రాలను కూడా లాగుకుని ముస్లిలకు ధారాదత్తం చేస్తారని కూడా ఆన్నారు. ఈ అంశం పైనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా కౌంటర్ ఇస్తూ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని చెప్పుకు వచ్చారు. ఆ అంశాలన్నీ మీడియాలో వచ్చాయి.

   లోక్ సభ ఎన్నికల ప్రచారం ఆరంభంలో మోదీ ప్రసంగాలకు రెండో విడతల పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. స్వరం మారింది. కాంగ్రెస్ ను, ముస్లీంలను టార్గెట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఎన్నడూ ముస్లీంలను మచ్చిక చేసుకునేందుకే విధానాలే అనుసరిస్తూ వచ్చిందని విమర్శించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ముస్లింల రిజర్వేషన్లు పెంచడాన్ని, కర్ణాటకలో ముస్లీం లను రిజర్వేషన్ల కోసం బీసీ కోటా కింద తీర్చడాన్ని దుమ్మెత్తి పోశారు మోదీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో మత విద్వేషం పెరిగిపోయిందని తాజాగా అజంగఢ్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పాక్ టెర్రరిజాన్ని పెంచి, దేశం పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడినా, భారత్ కఠినం గా వ్యవహరించ లేదని, తమ హయాం లోనే సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోది చెప్పుకువచ్చారు. నక్సల్స్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంభించాయనీ దుమ్మత్తి పోశారు. ఇటీవల పాకిస్తాన్ విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలని, పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయన్న వ్యాఖ్యలనూ మోదీ తనకు అనుకూలంగా మార్చుకుని ఓట్లు దండుకునే ప్రసంగాలే చేశారు.

   ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశంలో నెలకొన్న నిరుద్యోగం, రైతుల డిమాండ్లు వంచి అంశాలను కానీ, చేసిన అభివృద్ధి, సాధించిన ఘనకార్యాలను ఏ ప్రసంగాల్లోనూ ప్రస్తావించకుండా,, కేవలం ప్రత్యర్థులపై కారాలు నూరే ప్రసంగాలనే చేశారు. లోక్ సభ ఎన్నికలు నాల్గోవిడత పోలింగ్ కూడా ముగిసింది. అంటే 377 స్థానాల ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా మూడు విడతల్లో ఢిల్లీ, పంజాబ్ సహా 163 స్థానాల పోలింగ్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ తన శైలి మార్చుకోవడానికి, యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏమిటి.? మోదీ వ్యూహాల్లో ఇదీ ఓ భాగమా. పార్టీ శ్రేణుల్లో పెరిగి పోతున్న నిరాశ, నిస్పృహలను తొలగిం చేందుకు కొత్త ఎత్తుగడా పోలింగ్ సరళి చూసిన తర్వాత తీసుకున్న ఆపద్ధర్మ దిద్దుబాటు ప్లాన్ లో భాగమా చూడాలి.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్