సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో బిజీగా గడిపారు సీఎం జగన్. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఆయనకు కాస్త విరామం దొరికింది. విరామ సమయంలో ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. తాజాగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో పర్యటించనున్నారు జగన్. కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలు స్తోంది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు 3 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ID కోర్టుకు, CBIకి సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.
సీఎం జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటన
0
197
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


