మే 19 నాటికి నైరుతి రుతుపవనాలు

ఎండలు, ఉక్కపోతలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్‌, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏటా మే 22న దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి మూడు రోజులు ముందుగానే వస్తున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్