బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కవిత లిక్కర్ స్కాం వల్లే ఎంతోమంది మందుబాబులు తయారయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. హరీష్రావు సిద్ధిపేటను అభివృద్ధి చేస్తే, సిద్ధిపేట ప్రచారానికి కేసీఆర్ ఎందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి ఆయ్యారంటే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లేనని గుర్తుపెట్టుకోవాలన్నారు నీలం మధు. బీజేపీ, బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలను ఏం చేశారని ప్రశ్నించారు.
నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం
0
175
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


