28.7 C
Hyderabad
Thursday, May 30, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ముఠా జయసింహ ఎన్నికల ప్రచారం

బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్ధి పద్మారావుగౌడ్‌ విజయాన్ని కాంక్షిస్తూ ముషీరాబాద్ బీఆర్ఎస్‌ నేత ముఠా జయ సింహ ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. మచ్చలేని నాయకుడు పద్మారావు గౌడ్‌ను ప్రజలు ఆదరించి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వాకర్‌ లను కలసి కరపత్రాలను అందజేశారు.

బీటీపీ ప్రాజెక్ట్‌ నిలుపుదలపై లేఖ

సీఎం జగన్‌ స్వార్ధానికి ఏపీ సర్వనాశనం అయ్యిందంటూ మండిపడ్డారు కూటమి నేతలు. కళ్యాణ్ దుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. బీటీపీ ప్రాజెక్ట్‌ నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తీరుపై మండిపడ్డారు కూటమి నేతలు.

స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్ జిల్లా SAP వాకర్ అసోసియేషన్‌ సభ్యుల్ని కలిసారు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. జిల్లా కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ కళాశాల గ్రౌండ్లో వారితో కలిసి మార్నింగ్ వాక్ చేసారు. అనంతరం సైకిలింగ్ చేసి తేనేటి విందులో పాల్గొన్నారు. వాకర్ అసోసియేషన్ సభ్యుల సమస్యల్ని విన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

5కె రన్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 5 K రన్‌ నిర్వహించారు. స్వీప్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టరేట్‌ నుండి ప్రారంభమైన 5కే రన్ ప్రధాన రహదారి నుండి అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది.

పోలీసులు ఫ్లాగ్ మార్చ్

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా రాయదుర్గం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. శేరిలింగంపల్లి మణికొండ నుంచి దర్గా వరకు ఈ కవాతు నిర్వహించారు. స్ధానిక పోలీసులతోపాటు CRPF దళాలు ఈ మార్చ్‌లో పాల్గొన్నాయి. స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు అధికారులు.

ప్రత్యేక బస్సులు , అదనపు భోగీలు

ఎన్నికల వేళ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఆ సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు 1400, ఏపీకీ అదనంగా 160 సర్వీసులను నడుపుతోంది. కాగా వెయిటింగ్‌ లిస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

సైబర్ సెక్యురిటీ బ్యూరో

సైబర్‌ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. వీరి ఆగడా లకు చెక్‌ పెట్టేలా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా 33వేల 029 అనుమానాస్పద సిమ్‌కా ర్డులతోపాటు, IMEI నంబర్‌ ఆధారంగా 3,769 సెల్‌ఫోన్లను స్తంభింపచేసారు. వివిధ రకాల ప్రలోభాలకు గురిచేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వైద్యం వికటించి బాలింత మృతి

వైద్యం వికటించి పిట్ల సుమలత అనే 25 ఏళ్ల బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమం టూ బంధు వులు రాస్తారోకో కు దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం తిరుమల హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. వైద్యురాలు సుమలతపై చర్యలు తీసుకోవాలన్న బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేసారు.

అనుమానాస్పద బ్యాంక్  ఖాతాలు

అనుమానిత బ్యాంక్‌ ఖాతాలను స్ధంభింపజేయాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ తరహా 2.5 లక్షల ఖాతాలు మూడు నెలల కాల వ్యవధి లో రద్దయ్యాయి. లావాదేవీలు జరగని ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమకావడం, ఆ వెంటనే వేరే ఖాతాలోకి మళ్లించడాన్ని అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తారు.

మరో ఆరు నెలలు పొడిగింపు

భారతీయులకు పర్యాటక వీసా మినహాయింపును మరో ఆరు నెలలు పొడిగించింది థాయిలాండ్‌ ప్రభుత్వం. సాధారణ పాస్‌పోర్ట్‌ ఉన్న వారు గరిష్టంగా 30 రోజులపాటు పర్యటించవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్‌ ప్రభుత్వం 2023 నవంబర్‌ 10 తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుండటంతో వీసా వెసులుబాటును మరో ఆరు నెలల పాటు పెంచింది. థాయ్‌ క్యాబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఏడాది నవంబర్‌ 11 వరకు అమలులో ఉంటుంది.

Latest Articles

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్‌ వార్నింగ్‌

     ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్