ఏపీలో రాజుకున్న రిజర్వేషన్ వార్


  పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్‌ రగడ ముదురుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ముస్లిం రిజర్వేషన్లపై తెలుగు దేశం అధినేత చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడ గలరా ,కాదంటే ఎన్డీఏ నుంచి బయటకు రాగలా అని సవాల్‌ విసిరారు. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను తొలగించమని చెప్పడంలో ఆంతర్యమేంటి..? మోదీ మాటను లెక్క చేయడం లేదా..? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ వ్యాఖ్యలు చేశారా..?

పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్‌ దుమారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీజేపీని గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతోంది బీజేపీ. ఎన్ని కల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నారు కమలనాథులు. అయితే.. ఎన్డీఏతో జత కట్టిన చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్లను తొలగించబోమని హామీ ఇచ్చారు. కావాలనే మైనార్టీ రిజర్వేషన్లపై వైసీసీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే, ఇవే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు అటు తెలుగు దేశం నేతలు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు.

   నెల్లూరు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్‌ చంద్రబాబును టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్న ఆయన..ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని నిప్పులు చెరిగారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా? అన్న ఆయన. రిజర్వేషన్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు రాగలరా? అని నిలదీశారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్నీ మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారన్న జగన్‌. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటు తనం ఆధారంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచికాదని హెచ్చరించారు.

   ఇక ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయనే ప్రచారం జోరందు కుంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తు న్నాయి. ఇందులో భాగంగానే బీసీ కుల గణన చేపట్టి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వే షన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అందులో భాగం గానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దళితులు కూడా రిజర్వేషన్‌ అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లను కొనసాగిస్తా మని అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో మాదిగ, మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం.మరోపక్క రిజర్వేషన్‌ అంశంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దే చేయడం పక్కా అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు చెబుతున్న ప్పటికీ, క్షేత్రస్థాయిలో జనం మదిలో ఉన్న అనుమానం తొలగిపోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి స్పష్ట మైన హామీ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు తెలు స్తోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్