ఓటీటీలో అదరగొడుతున్న ‘హీరామండి: డైమండ్ బజార్’

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరామండి: డైమండ్ బజార్’ ప్రపంచవ్యాప్తంగా ఓటిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ఒక కళాఖండం అంటూ విమర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు వెండితెరపై ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో OTT ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, బ్రేకింగ్ బాడ్ వంటి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సిరీస్‌లతో పోటీపడుతూ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో హీరామండి ఒకటి అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉత్కంఠభరితమైన విజువల్స్ నుండి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ భన్సాలీ ప్రతిభకు నిదర్శనం. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన “హీరామండి: ది డైమండ్ బజార్” మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో 190 దేశాలలో విడుదలైంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్