ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రంగా వైసీపీపై కూటమి టార్గెట్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ చట్టం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తామని చెబుతున్నాయి. మరోవైపు అధికార వైసిపి ఈ ప్రచారం పై మండి పడుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం జగన్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఈ యాక్ట్ అమలులోకివస్తే.. భవిష్యత్ లో ఎలాంటి వివాదాలకు తావు ఉండవంటున్నారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదనీ ఏపీ సీఎం స్పష్టం చేస్తున్నారు.

ఏపీ లో జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అటు అధికార వైసిపి, ఇటు టిడిపి కూటమి మధ్య ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై అధికార వైసిపి, టిడిపి కూటమి దృష్టి సారించాయి. కొద్ది రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పేదల భూములు లాక్కునేందుకే వైసిపి ఈ యాక్టు తీసుకు వచ్చింది అని ప్రతి పక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ యాక్టు ని రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వస్తే.. ఈ యాక్టు రద్దు పైనే రెండో సంతకం అంటూ చెబుతున్నారు.

ప్రతిపక్షాల విమర్శలకు సీఎం జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని విషప్రచారం చేస్తున్నారని టిడిపిపై మండి పడ్డారు సీఎం జగన్. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సీఎం జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. భవిష్యత్ లో భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాదని చెప్పారు. భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందనీ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కింద ఇచ్చే ల్యాండ్ లైటిల్స్ కు బీమా కూడా ప్రభుత్వం చేస్తుందనీ సీఎం జగన్ వివరించారు. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని, , వారి పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయినీ, ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యిందనీ సీఎం చెప్పారు. ప్రతి రైతు దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల నిజంగా రైతుకు నష్టం జరుగుతుందా ప్రతి పక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదని చెబుతోంది అధికార వైసిపి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు చాలా రకాలు భూములు ఉన్నాయి. అయితే.. వాటికి సంబంధించి, 30కి పైగా రికార్డులు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నాటివి. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే, 90 శాతం మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరిం చుకుంటారు. అందుకు కారణం. భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందన్న భయం. అలా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగడానికి ప్రధాన కారణం సరైనా రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండటమే.

భూములకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి..ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి, వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది. ఎవరి అధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్నా.. వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. యజమాని తప్ప ఇతరులు ఎవరూ ఇది నా భూమి అని యాజమానులపై కేసులు వేసే అవకాశం ఉండదు.

దేశవ్యాప్తంగా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలు ఉన్నాయి. భూవివాదాల వల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో భూమి ఎవరిది? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలని, అందుకు పాత చట్టాల, స్థానంలో స్పష్టమైన ఒకే ఒక్క చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్ర ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ -2022ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. వాటన్నిటిలో అన్ని వివరాలు క్లియర్‌గా ఉండాలి. అలాగే ఈ 30 చోట్ల వివరాలు బాగానే ఉన్నా ఎవరూ లిటిగేషన్ పెట్టరను కోవడానికి లేదు. ఇక రెవెన్యూ, భూ సంబంధిత చట్టాలు, జీవోలు వంటివి కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నిటినీ కొట్టి పారేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్- 2022ను తీసుకొచ్చారు.

కొత్త చట్టం ప్రకారం, ఒకసారి రికార్డులో మీ పేరు చేరి, మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధం అవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా -తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారెంటీగా నష్ట పరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారెంటీ అన్నారు.టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు సరళంగా ఉంటాయి. లింకు డాక్యుమెంట్లు, వారసత్వ తగాదాలు ఏమీ ఉండవు. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌లో ఉంటుంది. ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు.టైటిల్‌ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్‌ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్‌ రిజిస్టర్‌లో ఉన్న పేరే ఖరారవుతుంది. ఈ చట్టం ప్రకారం టైటిల్‌ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు.పాత వ్యవస్థ స్థానంలో ల్యాండ్ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్‌ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్‌ వ్యవస్థలు ఏర్పాటవుతా యి. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్