స్వతంత్ర సంక్షిప్త వార్తలు

గుంటూరులో మాజీ హోంమంత్రి సుచరిత ఎన్నికల ప్రచారం

గుంటూరు ఎన్నికల ప్రచారంలో మాజీ హోంమంత్రి సుచరిత విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో విజయం వైసీపీదే అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి ప్రజలు పట్టం కడతారన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయా లన్నదే తమ పార్టీ ఆకాంక్ష అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తా మని చెప్పడం బాధాకరం అన్నారు. గతంలో టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు సుచరిత.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజిలెన్స్ దాడులు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వ హించారు. నియోజకవర్గంలోని 43వ డివిజన్‌లో ఓ నకిలీ సిగరెట్ గోడౌన్‌ గుర్తించారు. గోడౌన్‌ తనిఖీలు నిర్వహించి 38 లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని గుంటూరు శ్రీనివాస్‌గా గుర్తించి, కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు సీఐ వెంకటేశ్వరరావు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పోలీసుల తనిఖీలు

    ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పుష్ప త్రీ సినిమాను చూపించాడు ఓ పెద్దాయన. స్కూటీలో మద్యం బాటిల్స్‌ను నింపుకుని తెలంగాణ నుంచి పయనమై, కాలం కలసిరాక నందిగామ ఖాకీలకు చిక్కాడు. స్కూటీలో గుట్టు చప్పుడు మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టి నట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్‌ తెలిపారు. వంద క్వార్టర్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని వృద్దుడిపై కేసు నమోదు చేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్